- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RSP: బెటాలియన్ పోలీసులకు RS ప్రవీణ్ కుమార్ కీలక రిక్వెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: బెటాలియన్ పోలీసుల(Battalion Police) ఆందోళనపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా సోమవారం పోస్టు పెట్టారు. ‘తెలంగాణ హోంమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వైఫల్యం వల్లనే నేడు టీజీఎస్‌పీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. యూనిఫాం ధరించిన స్పెషల్ పోలీసులే ఉద్యమకారులై ధర్నాల్లో పాల్గొనడం ప్రజాస్వామ్య వ్వవస్థలో ఎన్నడూ చూడలేదు. వాళ్లకు ఇంతటి తీవ్రమైన పరిస్థితి ఎందుకొచ్చిందో ఒకసారి ఆలోచించాలి. ప్రస్తుతం పోలీస్ శాఖను గుప్పిట్లో పెట్టుకున్న రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. దీనిపై ఇంతవరకు స్పందించకపోవడం, ప్రకటన విడుదల చేయకపోవడం మంచిది కాదు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మౌనం వల్లనే పరిస్థితి మరింత తీవ్రతరం అవుతున్నది. ఆయన సకాలంలో స్పందించి ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదు. సమస్యను పరిష్కరించకపోగా.. సీఎం డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగుతున్నారు. తరచూ పోలీసు కుటుంబం వచ్చాను అని చెప్పుకోవడం కాదని.. ముందు వారికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సూచించారు.
అంతేకాదు.. ‘అసంతృప్తితో ఉన్న కానిస్టేబుళ్ల మానసిక స్థితి ఏంటో తెలంగాణ డీజీపీ జితేందర్(DGP Jitender)కు తెలియంది కాదు. వాళ్ల పేదరికం, గ్రామీణ నేపథ్యం, కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సస్పెన్షన్లను, బర్తరఫ్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ ఆందోళన సందర్భంగా చాలా సమస్యలు (బెటాలియన్లలో వెట్టిచాకిరీ మరియు అవినీతి లాంటివి) డీజీపీ దృష్టికి వచ్చుంటాయి. వాటి పరిష్కారాలకు త్వరితగతిన చర్యలు చేపట్టాలి’ డీజీపీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. ఆందోళనలు చేస్తున్న పోలీసులు కూడా సంయమనం పాటించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిక్వెస్ట్ చేశారు.