Maharashtra: మహారాష్ట్రలో బీజేపీ మూడో జాబితా.. 25 మంది అభ్యర్థుల ప్రకటన

by vinod kumar |
Maharashtra: మహారాష్ట్రలో బీజేపీ మూడో జాబితా.. 25 మంది అభ్యర్థుల ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Assembly elections)కు గాను బీజేపీ మూడో జాబితాను సోమవారం విడుదల చేసింది. ఈ లిస్టులో 25 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో నలుగురు మహిళలకు చోటు దక్కింది. వారిలో కరంజా నియోజకవర్గం నుంచి సాయి ప్రకాష్ దాహకే(sai Prakash dhahake), వాసాయి సెగ్మెంట్‌లో స్నేహ ప్రేమ్ నాథ్ దూబే(Sneha premnath dube), వెర్సోవా నుంచి భారతీ హేమంత్ లావ్‌కర్ (Barathi hemanth lavkar), లాతూర్ సిటీ నుంచి అర్చనా శైలేష్ పాటిల్(Archana shailesh patil) ఉన్నారు. మహాయుతి కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాల్లో పోటీ చేస్తోంది. తాజా జాబితాతో కలిపి బీజేపీ ఇప్పటి వరకు 146 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొదటి లిస్టులో 99, రెండో జాబితాలో 22 మంది అభ్యర్థులను వెల్లడించింది. మరోవైపు మూడో జాబితాతో పాటు నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు కూడా బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్‌ సంతుక్‌ మరోత్రావ్‌ హంబార్డే(santhuk marothrav hambarde)ను బరిలో నిలిపింది. కాగా, వచ్చే నెల 20న మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story