- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మల్లన్న కుటుంబాన్ని పరామర్శించిన విజయశాంతి..
దిశ, మేడిపల్లి: మల్లన్న అక్రమ అరెస్ట్ లను వ్యతిరేకిస్తూ మేడిపల్లి బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి మల్లన్న కుటుంబం వద్దకు చేరుకొని మల్లన్న భార్య మమతను ఓదార్చారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కష్టాలు ప్రపంచమంతా తెలుపుతున్న మల్లన్న గొప్ప ధైర్యవంతుడు అని, అలాంటి వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ వాళ్లు చేస్తున్న తప్పులను బయట పెడుతున్నాడని కోపంతో, ఉక్రోశంతో ఇప్పటికి ఐదో సారి మల్లన్నపై పలు కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు.
బుధవారం చెంచెలుగూడ జైలుకు తరలించి 14 రోజులు రిమాండ్ కి కూడా పంపారని అన్నారు, ‘కేసీఆర్ సోషల్ మీడియా మీద పడుతున్నారు. అరాచకాలు సృష్టిస్తున్నారు. రౌడీలు గుండాలతో బెదిరిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడిన ఎత్తుకుపోతాం, తప్పులు చేసిన చూపించకూడదు అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఒకవేళ తమ తప్పులు చూపించారంటే జైల్లో పెడతం. కేసులు పెడతాం ఇంకా ఏమన్నా చేయొచ్చు’ అని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇద్దరు ఆడపిల్లలతో మల్లన్న భార్య ఎలా జీవించగలదు, ఒక బిడ్డ తండ్రి లేనిదే నిద్రించదని, చిన్నారులను చూస్తే మనసు చలించి పోతుందని ఆమె అన్నారు.
ఇదేమి న్యాయం సోషల్ మీడియా వారు వాళ్ల విధి వాళ్లు చేయవద్దా, మీకు లొంగితే వెరీ గుడ్, లొంగకపోతే వారు చెడ్డవారా అని ప్రశ్నించారు. మల్లన్న కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మల్లన్నపై అక్రమ కేసులు రద్దు చేసి మల్లన్నను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్న భార్య మమత మాట్లాడుతూ తన భర్తపై అనేక అక్రమ కేసులు పెట్టి బయటకు రాకుండా చేస్తున్నారని, ఎలాగైనా తన భర్తను బయటికి తీసుకురావాలని అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.