కుషాయిగూడలో ‘ట్రాఫిక’ర్ ...

by Aamani |
కుషాయిగూడలో ‘ట్రాఫిక’ర్ ...
X

దిశ, కాప్రా : ట్రాఫిక్ సమస్యలతో నిత్యం కాప్రా , కుషాయిగూడ ప్రాంతాల్లో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇందుకు ప్రధాన రహాదారికి ఇరువైపుల ఫుట్ పాత్ ల ఆక్రమణలే ప్రధాన కారణమని ప్రయాణికులు వాపోతున్నారు. ఇటీవల మున్సిపల్, ట్రాఫిక్ పోలీసులు రహదారులకు ఇరువైపుల వెలసిన ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించారు. తొలగించిన కొన్ని గంటల సమయంలోనే తిరిగి యథావిదిగా ఫుట్ పాత్ లపై తిరిగి తిష్ట వేశారు. దీంతో వచ్చిపోయే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీనికి తోడు వ్యాపారులు రోడ్లపైనే తమ వ్యాపార సూచిక బోర్డులను ఏర్పాటు చేసుకోవటంతో రోడ్లు కుదించుకు పోయి ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఇసీఐఎల్ చౌరస్తా నుంచి కుషాయిగూడ బస్టాండ్ వరకు, చక్రిపురం చౌరస్తా నుంచి చర్లపల్లికి వెళ్లే దారిలో అడ్డగోలుగా ఇసుక లారీలు తిష్ట వేయడం తో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. అసలే అంతంత మాత్రన ఉన్న రోడ్లకు తోడు రహదారికి ఇరువైపుల అక్రమ వాహనాల పార్కింగ్, ఫుట్పాత్ వ్యాపారాలు కొనసాగడంతో ప్రయాణికులు నానా ఇక్కట్లకు గురవుతున్నారు.

జిల్లా కొర్డు సమీపంలో మున్సిపల్ అధికారులు రోడ్డు పక్కనే వెలసిన ఆక్రమణలను తొలగించినా నేడు యథావిధిగా బందోబస్తుగా షెడ్లు వేసుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. పోచమ్మ గుడి సమీపంలోని డీ మార్ట్ రోడ్డులో దుకాణదారులు బాజాప్తాగా రహదారుల పైనే ప్రమాదకరంగా వ్యాపార ప్రకటన బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. కుషాయిగూడ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉపకేంద్రం సమీపంలో తిరిగి అడ్డగోలుగా ఫుట్ పాత్ ల ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయమై సీసీఎస్ ప్రతినిధులు కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు, ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడి ట్రాఫిక్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీసీఎస్ ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed