- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్-2023 క్రికెట్ నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
దిశ, ఉప్పల్: ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ 2023 క్రికెట్ మ్యాచ్ లకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని కమిషనర్ డీఎస్ చౌహన్ తెలిపారు. త్వరలో ప్రారంభంకానున్న IPL - 2023 క్రికెట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సన్ రైజర్స్ యాజమాన్యంతో రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ సమీక్షా సమావేశం నెరెడ్ మెట్ లోని కమిషనర్ ఆఫీస్ లో నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరుగనున్న మ్యాచ్ ల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని నిర్వహణ బృందానికి సూచించారు. ఈ కార్యక్రమంలో సన్ రైజర్స్ సీఈవో షణ్ముగాం, మల్కాజ్ గిరి డీసీపీ జానకి, ఏసీపీ నరేష్ రెడ్డి, ఉప్పల్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.