విద్యార్థులను చితకబాదిన పాఠశాల చైర్మన్ కొడుకు

by Aamani |
విద్యార్థులను చితకబాదిన పాఠశాల చైర్మన్ కొడుకు
X

దిశ,శామీర్ పేట: ఆడుకుంటామని అడిగితే వాతలు వచ్చేలా దాడి, పైగా ఎవరికైనా చెప్తే చంపేస్తాను అంటూ స్కూల్ యాజమాన్యం బెదిరింపులు. పేరెంట్స్ మీటింగ్ లో వెలుగులోకి వచ్చిన ఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల, తల్లిదండ్రుల కథనం ప్రకారం.... నాగర్ కర్నూల్ జిల్లా ఘణపురం గ్రామానికి చెందిన రమేష్ నాయక్ తన కుమారున్ని బంగారు భవిష్యత్తు కోసం తూముకుంట మున్సిపాలిటీ శామీర్ పేట లోని సెయింట్ పాల్ ఇంటర్నేషనల్ స్కూల్ నియమ నిబంధనలు పాటిస్తూ అన్ని తన కొడుకు భవిష్యత్ కోసం ఎన్నో కలలు కన్నాడు. అక్టోబర్ నెలలో పేరెంట్స్ మీటింగ్ ఉండటంతో పాఠశాలకు వచ్చిన రమేష్ నాయక్ తన కొడుకు దిగాలుగా ఉండడానికి గమనించి, ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగాడు.

ఒక్కసారిగా తండ్రి ఆప్యాయతతో స్కూల్ యాజమాన్యం చేసిన ఘాతకానికి వివరించారు. మీటింగ్ కు రెండు రోజుల ముందు క్రికెట్ ఆడుకుంటామని ప్రిన్సిపల్ ని అడిగినందుకు ఉపాధ్యాయులు, చైర్మన్ కొడుకు అభిలాష్ విచక్షణ రహితంగా వీపుపై, వీపు కింది భాగంలో చేసిన దాడిని వివరిస్తూ తన ఒంటిపై ఉన్న గాయాలను చూపించాడు. తనతో పాటు మరో ఆరు విద్యార్థులను గదిలో బంధించారని తెలుపడంతో కన్నీరు మున్నీరు అయ్యారైన గదిలో బంధించి దాడికి పాల్పడ్డారని, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులని మరచి ఉన్మాదులుగా విచక్షణ రహితంగా చిన్న పిల్లలని కనికరం లేకుండా దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అక్టోబర్ 31న బాధిత విద్యార్థి తల్లిదండ్రులు శామీర్ పేట పోలీసుల ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

విద్యార్థులైన చిన్నారులపై దాడులకు పాల్పడిన ఉపాధ్యాయులు రఫీ,చైర్మన్ కొడుకు అభిలాష తో పాటు స్కూల్ యాజమాన్యంపై చట్టపైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు పాఠశాల యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనాథ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed