- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలి.. ఎంపీ ఈటల రాజేందర్..
దిశ, కంటోన్మెంట్ః కంటోన్మెంట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం రోడ్ల విస్తరణ, కారుణ్య నియమాకాలు.. పేదలకు ఇళ్ల పట్టాలపై కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి సమావేశం వాడివేడిగా సాగింది. శనివారం కంటోన్మెంట్ బోర్డు నూతన అధ్యక్షుడు, బ్రిగేడియర్ ప్రశాంత్ బాజ్‌పాయ్ అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేశ్ హాజరయ్యారు. బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, జాయింట్ సీఈఓ పల్లవి విజయ్‌వన్షీ, డిప్యూటీ సీఈఓ వీకే నాయర్,హెచ్ఎండీఏ ఇంజనీర్లు యూసఫ్ హుస్సేన్, హరిక్రిష్ణ, బోర్డు అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో బోర్డు అధ్యక్షుడిగా ప్రశాంత్ బాజ్ పాయ్ ప్రమాణ స్వీకారం చేశారు.
పేదల ఇళ్ల కు పట్టాలివ్వాలి
కంటోన్మెంట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 40–50 ఏళ్లుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న పేదల ఇళ్లను క్రమబద్దీకరించేలా చూడాలని ఎంపీ ఈటల బోర్డు అధికారులకు సూచించారు. దీనిపై సిఈవో స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలాలు చూపిస్తూ, భూబదలాయింపు కోరితే సమస్య పరిష్కారం అవుతుందని వివరించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ.. నివేదిక తయారు చేస్తే భూ బదాలయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా హస్మత్‌పేట సమీపంలోని కంటోన్మెంట్ స్థలంలో బోర్డు కింది స్థాయి ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఎంపీ కోరారు.
5 శాతం సీలింగ్ ఎత్తివేయాలి..
అత్యంత దుర్భర పరిస్థితుల్లో కంటోన్మెంట్‌లో పనిచేస్తూ, అర్దాయుష్పుతో విధుల్లోనే ఉండగానే మరణించిన మాజీ ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాలను చేపట్టాలని ఈటల రాజేందర్ సూచించారు.. 5 శాతం సీలింగ్‌ను ఎత్తేస్తూ అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని కోరారు. అన్ని జనావాసాల్లో కమ్యూనిటీ హాళ్లను నిర్మించాలన్నారు. అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్నవాటి నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలన్నారు.