- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేర్‌టేకర్‌గా ఉండి నగలతో ఉడాయించిన వ్యక్తి రిమాండ్..
దిశ, కూకట్పల్లి: అనారోగ్యంతో మంచాన పడ్డ వ్యక్తికి కేర్‌టేకర్‌గా చేరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడిన ఓ ఘరాన దొంగను కూకట్పల్లి, బాలానగర్ సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ చంద్రశేఖర్, సీఐ నరసింగరావు తెలిపిన వివరాల ప్రకారం.. వివేకానందనగర్ కాలనీకి చెందిన కొత్తకోట శైలజ(60), తన భర్త అనారోగ్యంతో మంచాన పడటంతో బోడుప్పల్ లోని అన్నపూర్ణ హోం కేర్ సర్వీసెస్ నుంచి ఖమ్మం కొత్తగూడెంకు చెందిన బంటి చంటి కుమార్ అలియాస్ రాకేష్, అలియాస్ దేవిడ్(26)ను కేర్ టేకర్‌గా విధులలో చేర్చుకున్నారు.
ఇదిలా ఉండగా హనుమాన్ జయంతి రోజున కొత్తకోట శైలజ స్థానికంగా ఉన్న యోగా క్లాస్‌కు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన బంటి చంటి కుమార్ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రెడ్మీ మొబైల్ ఫోన్లు సుమారు రూ. 7 లక్షల విలువ చేసే వస్తువులతో ఉడాయించాడు. కొత్తకోట శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన కూకట్పల్లి పోలీసులు బంటి చంటి నేర చరిత్రను చూసి ఆశ్చర్య పోయారు. బంటి చంటిపై గతంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి, మీర్పేట్, బాలాపూర్, సరూర్ నగర్, హిమాయత్‌నగర్, వనస్థలిపురం పోలీస్స్టేషన్లతో పాటు సైదాబాద్ పోలీస్ స్టేషన్లలో మొత్తం 33 చోరీ కేసులలో నిందితుడిగా ఉన్నట్టు ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు.
నిందితుడి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ కేర్టేకర్లను నియమించుకునే ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, ఇండ్ల వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు, అపార్టుమెంట్లలలో భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని ప్రజలకు సూచించారు. కేసును ఛేదించిన కూకట్పల్లి డీఐ ఆంజనేయులు, డీఎస్సై రజాఖ్, బాలానగర్ సీసీ పోలీసులను అభినందించారు.