రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఇంటెలిజెన్స్ చీఫ్

by Kalyani |
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఇంటెలిజెన్స్ చీఫ్
X

దిశ, మేడ్చల్ బ్యూరో : భారత రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము పర్యటన వల్ల అప్రమత్తంగా ఉండాలని ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ చీఫ్ ఎస్.పి.రామకృష్ణ అన్నారు. ఈ నెల 28వ తేదీన మేడ్చల్ జిల్లా, శామీర్ పేటలోని నల్సార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రామకృష్ణ నల్సార్ యూనివర్శిటీని సందర్శించి ఏర్పాట్లును పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. యూనివర్సిటీ లో ఏర్పాట్లపై డిసిపి కోటిరెడ్డితో కలిసి ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్.పి రామకృష్ణ పర్యవేక్షించారు. సంబంధిత శాఖల అధికారులు నిర్వహిస్తున్న పనులను పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు తెలియజేశారు. రోడ్లు మరమ్మత్తులు, రెడ్ కార్పెట్లు, నిరంతరాయ విద్యుత్తు, పుష్పలంకారణ, వైద్య శిబిరాలు, అంబులెన్సు, సీటింగ్, మొబైల్ టాయిలెట్స్, పాసులు వంటి ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేస్తుకుంటూ సకాలంలో పనులు పూర్తి చేయాలని రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కీసర ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి, శామీర్ పేట్ తహాసీల్దారు యాదగిరిరెడ్డి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed