- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ: మంతి శ్రీనివాస్ గౌడ్
దిశ, కూకట్పల్లి: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఆదివారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో హెడా ట్రక్ పార్కు వద్ద నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. శాంతి భద్రతల విషయంలో, మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందని అన్నారు.
దేశంలో అనేక రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. జాబ్ మేళాలో 9 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వందకు పైగా కంపెనీలు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు తీసుకున్నారని అన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 3 వేల మందికి అక్కడికక్కడే నియామక పత్రాలను అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు ముద్దం నర్సింహా యాదవ్, మందాడి శ్రీనివాస్ రావు, ఆవుల రవీందర్ రెడ్డి, సబీహ బేగం, పండాల సతీస్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, పగుడాల శిరీష, మాజీ కార్పొరేటర్ తూం శ్రావణ్ కుమార్, డీసీ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.