- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు క్రీడా స్ఫూర్తి అవసరం : డీసీపీ సత్యనారాయణ
దిశ, కుత్బుల్లాపూర్ : విద్యార్థులకు క్రీడా స్ఫూర్తి అవసరం అని బాలానగర్ జోన్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ అన్నారు.బాచుపల్లి లోని వీఆర్ఎస్ విజ్ఞాన జ్యోతి పాఠశాలలో 2024 సీబీఎస్ఈ ఖోఖో టోర్నమెంట్ ను డీసీపీ ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై బాలానగర్ ఏసీపీ హనుమంతరావు, ఆసియా ఖో -ఖో గోల్డ్ మెడలిస్ట్ ప్రమోద్ థోరట్ తో కలిసి ప్రారంభించారు.ఈ టోర్నమెంట్ ను సెప్టెంబర్ 22 నుండి 25 వరకు జరగనుంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఎస్ విజ్ఞాన జ్యోతి స్కూల్ ఇలాంటి టోర్నమెంట్ లను నిర్వహించడం అభినందనీయం అని అన్నారు.అండర్ -14,అండర్ -17,అండర్ -19 బాలురు, బాలికలు విభాగాలలో సుమారు 5500 విద్యార్థులు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో వీఆర్ఎస్ విజ్ఞాన జ్యోతి ట్రస్ట్ సభ్యులు వల్లూరి పల్లి రాజా రామ్ మోహన్ రావు, రాజశేఖర్, గీతా, రాజ్ కుమార్, పాఠశాల డైరెక్టర్ కొడాలి విజయ రాణి పాల్గొన్నారు.