- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్రీడల అభివృద్ధికి పెద్దపీట: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, శామీర్ పేట:సీఎం కేసీఆర్ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలంలోని హకీంపేట్ లో బుధవారం తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో 17 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ హాల్, వెయిట్ లిఫ్టింగ్ హాల్, రోయింగ్ హాల్, ఫిజియోథెరపీ హాల్, స్ట్రెంత్ అండ్ కండిషన్ హాల్, 4.5 కీ.మీ క్రాస్ ట్రాక్ లను క్రీడా మౌలిక సదుపాయాలను తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి 17వేల గ్రామాలలో క్రీడా ప్రాంగణాలను నిర్మించామని అంతర్జాతీయ స్థాయిలో ఒలంపిక్స్, కామన్వెల్త్, వివిధ క్రీడాంశాలలో ప్రపంచ చాంపియన్ షిప్ లను సాధించి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చే క్రీడాకారులకు నగదు ప్రోత్సాహాన్ని ఘననీయంగా పెంచామని, వీటితోపాటు విలువైన ప్రాంతాలలో ఇండ్ల స్థలాలను కేటాయించామని, తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 2 శాతం రిజర్వేషన్లు, ఉన్నత విద్య అభ్యసించడం కోసం 0.5% రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించామని వచ్చే క్యాబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ సహకారంతో ఆమోదం చేయించుకుంటామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర క్రీడ పాఠశాలలో క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించేందుకు శిక్షణ అందిస్తున్నామని అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. క్రీడాకారులకు పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తూ దేశంలో తెలంగాణ రాష్ట్రం క్రీడల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా మారుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు వాణీదేవి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, క్రీడా పాఠశాల ఓఎస్ డీ డాక్టర్ హరికృష్ణ, సాట్స్ ఉన్నతాధికారులు సుజాత, మనోహర్ తూంకుంట వైస్ చైర్మన్ పన్నాల వీరరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్, మునిసిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు నోముల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.