- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA : చదువుతో పాటు క్రీడలు ముఖ్యం
దిశ, కంటోన్మెంట్ : చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ అన్నారు. సికింద్రాబాద్ జింఖానా మైదానం లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14,17ల కోకో , కబడ్డీ క్రీడల టోర్నమెంట్ ను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ గణేష్ మాట్లాడుతూ..విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలు పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీస్తాయన్నారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ లో రూ. 361 కోట్ల ను క్రీడల కోసం కేటాయించడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను కేవలం చదువులకే అంకితం చేస్తున్నారని, పిలల్లను క్రీడా రంగంలో కూడా రాణింపజేస్తే ఉద్యోగం, ఉపాధి, వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ కి ఒక స్టేడియం పెట్టాలని ఆలోచిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్రీడలు అంటే అమితమైన ఆసక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు చిరంజీవి, శ్రీధర్ , రమేష్ గౌడ్, శ్రీదేవి, చంద్రకాంత్ తో పాటు కాంగ్రెస్ నాయకులు ముప్పిడి గోపాల్, శ్యాం సన్ రాజు, బద్రినాథ్ యాదవ్, నాగినేని సరిత తదితరులు పాల్గొన్నారు.