రంగధాముని చెరువు సుందరీకరణ పనుల్లో వేగం పెంచండి: ఎమ్మెల్యే మాధవరం

by Kalyani |
రంగధాముని చెరువు సుందరీకరణ పనుల్లో వేగం పెంచండి: ఎమ్మెల్యే మాధవరం
X

దిశ, కూకట్​పల్లి: రంగధాముని (ఐడీఎల్​) చెరువు సుందరీకరణ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలాజీనగర్​ డివిజన్​ పరిధిలోని రంగధాముని చెరువు సుందరీకరణ పనులను ఎమ్మెల్యే బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ట్యాంక్​ బండ్​ను పోలిన విధంగా రంగధాముని చెరువును ఎంతో సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

రెండు నెలలో సుందరీకరణ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు చెరువు సుందరీకరణ, ఉద్యానవనం అభివృద్ధి పనులు చేపడుతున్నామని, మంచి పర్యాటక ప్రదేశంగా అభివృద్ది చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్​ బాబురావు, డీఈ ఆనంద్​ తదితరులు పాల్గొన్నారు.

Next Story