- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య
దిశ, బాలానగర్: తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాలానగర్ సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. సాలెబిర్ నల్లి గ్రామం గుల్బర్గా నుండి పని కోసం హైదరాబాద్‌కు వచ్చిన మారుతి, ఇందిర దంపతులు గత కొంతకాలంగా ఓల్డ్ బాలానగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె కావేరి (25), ఇద్దరు కుమారులు సాయి కుమార్ (23), మల్లికార్జున్ (20) ఉన్నారు. మారుతి పండ్ల వ్యాపారం, ఇందిర ప్రైవేటు కంపెనీలో పని చేసుకుంటుండగా పెద్ద కొడుకు సాయి కుమార్ ఒక పార్టీ ఆఫీసులో సోషల్ మీడియా ఎడిటర్‌గా, చిన్న కొడుకు మల్లికార్జున్ మార్కెటింగ్ జాబ్ చేసుకుంటున్నారు.
చిన్న కొడుకు మల్లికార్జున్ ఫోన్ కొనడానికి జమ చేసుకున్న డబ్బును సాయి కుమార్ వృధాగా తన అవసరాల నిమిత్తం ఖర్చు చేస్తున్నాడని తెలుసుకుని తల్లి ఇందిర మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సాయి కుమార్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని కిచెన్‌లో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన అనంతరం దర్యాప్తు మొదలుపెట్టారు.