ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం.. శంభీపూర్ రాజు..

by Sumithra |   ( Updated:2024-09-09 12:00:42.0  )
ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం.. శంభీపూర్ రాజు..
X

దిశ, దుండిగల్ : ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ, శంభీపూర్ లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో స్థానిక కౌన్సిలర్లు కలిసి సమస్యల పై వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులతో మాట్లాడి ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తానన్నారు. అంతకు ముందు గణపతి నవరాత్రుల్లో భాగంగా స్థానికంగా ఏర్పాటుచేసిన గణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ఎలుగారి సత్యనారాయణ, శంకర్ నాయక్, శ్రీనివాస్ యాదవ్, కుంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed