- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి సాయన్న: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
దిశ, కంటోన్మెంట్ / బోయిన్ పల్లి: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య దళిత కుటుంబంలో జన్మించి, ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి సాయన్న అని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించి, జంట నగరాలకు అనేక సేవలందించారని గుర్తు చేశారు.
అదేవిధంగా, తాను కేంద్ర మంత్రిగా ప్రాతినిథ్యం వహించినప్పుడు తనను కలిసి కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నారని తెలిపారు. సాయన్న మృతి హైదరాబాద్ ప్రజలకు ప్రత్యేకంగా కంటోన్మెంట్ నియోజకవర్గానికి తీరని లోటన్నారు. సాయన్న మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.