- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు..
దిశ, అల్వాల్: రంజాన్ పర్వదినం వేడుకలు శనివారం అల్వాల్ సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో మైనార్టీ సోదరులు ఘనంగా నిర్వహించారు. కనాజీగూడ ఇందిరానగర్ లోని ఈద్గా మైదాన్ లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు ఖురాన్ ప్రవచనాలు వినిపించారు. రంజాన్ నెల అంటేనే పవిత్రమైన ప్రేమకు మానవత విలువలకు గుర్తింపు పొందిన మాసంగా భావించి ప్రతి మైనార్టీ భక్తి శ్రద్ధలతో కఠినమైన ఉపవాస దీక్ష చేసి శాంతియుతమైన సుఖజీవితం ఇవ్వమని అల్లాను వేడుకున్నారు.
ఉదయం నుంచే ఈద్గా మైదానాలు భక్తులతో కిక్కిరిపోయాయి. పోలీసులు ప్రార్థనలు జరిగే ఈద్గాల వద్ద బందోబస్తో ఏర్పాటు చేశారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇందిరానగర్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు సయ్యద్ మోసిన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై ప్రార్థనలు చేశారు.