- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్ని సమస్యలే అభివృద్ది శూన్యం.. నందికంటి శ్రీధర్..
దిశ, అల్వాల్ ; కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథసారధి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిత్యం ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజాసమస్యలు తెలుసుకుంటున్నామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ అన్నారు. శుక్రవారం అల్వాల్ గవర్నమెంట్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలైన బండబస్తిలో గడపగడపకు తిరుగుతూ ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరులు సమావేశంలో ప్రభుత్వ వైపల్యాలను ఎండగట్టారు. బస్తీలు కాలనీలలో ఎక్కడ అభివృద్ది ఫలాలు కానరావడంలేదన్నారు. ఇప్పటికి పాత అల్వాల్ ప్రాంతాలలో ఓపన్ నాలాలు దర్శనం ఇస్తున్నాయన్నారు.
ఎక్కడో మారుమూల గ్రామపంచాయితీ లేక మున్సిపాలటీ మాదిరిగా అల్వాల్ డివిజన్ బస్తీలు కానవస్తున్నాయన్నారు. 2016లో కార్పొరేషన్ ఎన్నికలకు 6 నెలల ముందు ఇండ్లు లేని పేదలందరికి డబుల్ బెడ్ రూంలు కట్టిస్తామని మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి అట్టాహాసంగా డబుల్ బెడ్ రూంలకు శిలాఫలకం మాత్రం వేశారు. కాని ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్ రూం కట్టలేదు పేదలకు పంచలేదన్నారు. అరచేతులో వైకుంఠం చూపుడం తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది శున్యం అన్నారు. సంక్షేమపథకాలు అంటూ ఊదరకొంటుకునే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ తెచ్చిన పథకాలకన్న గొప్పపథకాలు ఏమి తీసుక రాలేదన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అంటే ఏమిటి వాటిని ప్రజల్లోకి తీసుకపోయి వారి అభివృద్దిని కాంక్షించింది కాంగ్రెస్ పార్టీ గుర్తు చేశారు.
నిత్యావసర వస్తువలు చౌవకగా దొరికే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేవిధంగా ప్రతి మనిషి కలలు నిజంచేసేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ సాధించి తీరుతామన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల వాతావరణం తీసుకవంచాయని కార్యకర్తలకు గుర్తు చేశారు. వాటిని ఎదుర్కొనేందుకు ప్రతీ కార్యకర్త ఐక్యంగా ఎన్నికలను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేవిధంగా నడుం బిగించి ముందుకు నడువాలన్నారు. రానున్న రోజులు మనవే అని ప్రజలకు బరోస కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చంద్రశేఖర్, వెంకటేష్ యాదవ్, నిమ్మ అశోక్ రెడ్డి, డోలి రమేష్, కృష్ణగౌడ్, పవన్, శ్రీనివాస్, శివకుమార్, రాజలింగం, పాండు, సాయికుమార్, శ్రీపాల్ రెడ్డి, సంతోష్ రెడ్డి, వీనస్ మేరీ, పద్మ, సుభాషిని, నిర్మల, పైమా తదితరులు పాల్గొన్నారు.