- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నార్కొటిక్ డ్రగ్స్ తయారీ కేంద్రంపై పోలీసుల దాడులు.. భారీగా ముడిసరుకు పట్టివేత
దిశ, ఘట్కేసర్ః నగర శివారులో పోచారం మున్సిపాలిటీ, నారపల్లి దివ్య నగర్ లో నార్కోటిక్ డ్రగ్ తయారీ కేంద్రంపై ఎక్సెజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కల్తీకల్లు తయారీ కోసం వాడే రూ.30 లక్షల విలువైన మూడు కిలోల అల్ఫాజోలంతో పాటు ముడి సరుకులను స్వాధీనం చేసుకొని, తయారు చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. సంబంధించిన వివరాలను శనివారం దివ్యానగర్ లో నార్కోటిక్ తయారీ కేంద్రం వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. సూర్యాపేటకు చెందిన మేన శ్రీనివాస్ ఓ ఫార్మా కంపెనీలో కెమిస్ట్రీగా పని చేశాడు. శ్రీనివాస్ త్వరగా కోటీశ్వరుడు కావాలనే అత్యాశతో తన మిత్రులు కాకర చంద్రశేఖర్, పోలిశెట్టి రాంబాబు, తాడి లక్ష్మణ్ లను సంప్రదించాడు. అల్పాజోలం తయారీకి పన్నాగం రూపొందించారు. రాంబాబు ఆర్థిక సహాయాన్ని అందించగా, శ్రీనివాస్ కూకట్ పల్లిలోని నర్మదా కెమికల్స్ యజమాని రాజేశ్వరరావును సంప్రదించి అల్పాజోలం తయారీ కేంద్రానికి ఫార్ములా, ముడిసరుకులు, పరికరాలను సేకరించాడు. తయారు చేసిన అల్పాజోలంను కొనుగోలు చేసేందుకు నిజాంబాద్ లో ఉంటున్న తన స్నేహితుడు సునీల్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇలా అందరూ ఒక ముఠాగా ఏర్పడి ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారపల్లి దివ్య నగర్ ప్రాంతంలో నార్కోటిక్ డ్రగ్ అల్పాజోలం తయారు చేస్తున్నారు. సుమారు మూడు కేజీల ఆల్ ప్రోగ్రామ్ డ్రగ్ తయారు చేసి అమ్మకానికి రెడీగా ఉన్న సమయంలో పక్కా సమాచారం అందుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ ఎక్సైజ్ అధికారులు రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించి తయారీ కేంద్రంపై దాడి చేశారు. ఈ నార్కోటిక్ తయారి కేంద్రం గుర్తించి నిందితులను పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి అభినందించారు.