- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వన్ డిస్ట్రిక్ట్.. వన్ మెడికల్ కాలేజ్.. ఇదే నినాదంతో తెలంగాణను అభివృద్ధి చేస్తాం : యోగి ఆదిత్యనాథ్
దిశ,పేట్ బషీరాబాద్: రైల్వే, ఎయిర్‌పోర్ట్, జాతీయ రహదారుల అభివృద్ధి వంటి వాటితో పాటుగా వన్ డిస్ట్రిక్ట్.. వన్ మెడికల్ కాలేజ్.. నినాదంతో తెలంగాణను అభివృద్ధి చేస్తామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ తరఫున ఆయన ఆదివారం నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వాసులను ఉపేక్షించిందని.. ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలను నాశనం చేసిందని విమర్శించారు. హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగర్‌గా మారుస్తామని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగి అమాయకులు చనిపోయారని, మోడీ నేతృత్వంలో అదే ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్ జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం రాకముందు యూపీలో అరాచక పాలన కొనసాగేదని బీజేపీ ప్రభుత్వం వచ్చాక హత్యలు, దౌర్జన్యాలు లేవని తెలిపారు. తెలంగాణలో ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, ఆర్గనైజ్ క్రైమ్ వంటివి వివిధ రూపాల్లో వ్యవస్థను నాశనం చేస్తున్నాయని, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటినీ సరి చేస్తామని అన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌ని గెలిపించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయాలని విజ్ఞప్తి చేశారు.
రౌడీ ఎమ్మెల్యే కావాలా..?
అంతకుముందు బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గాన్ని రాష్ట్రంలోనే ఒక గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు బాధ్యతయుతంగా పనిచేస్తారని హిందూ సింహం యోగి ఆదిత్యనాథ్ సాక్షిగా ఓటర్లకు మాట ఇస్తున్నాఆని అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా ఒక రౌడీ కావాలా..? లేదా సేవ చేసే వ్యక్తి కావాలో ఆలోచించాలని తెలిపారు. 9 ఏండ్ల కాలంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో ఏమి అభివృద్ధి జరిగిందో చిత్తారమ్మ దేవి సాక్షిగా చెప్పాలని సవాల్ విసిరారు.