- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆగని అక్రమనిర్మాణం.. బరితెగించిన అక్రమార్కులు..
దిశ, కాప్రా: కాప్రా సర్కిల్ కుషాయిగూడలో నిబంధనలను ఉల్లంఘించి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. తీసుకున్న అనుమతులు ఒకలా చేపడుతున్న నిర్మాణాలు మరోలా యథేచ్చగా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. ఏకంగా కమర్షియల్ నిర్మాణాన్ని సెల్లార్ తోపాటు అదనపు అంతస్తు నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున్న స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని చేపట్టినా అధికారులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
బహుళ అంతస్తుల నిర్మాణం చుట్టు తెర వేసి తెర వేనుక చకచక పనులను నిర్వహిస్తున్నారు. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాల్సిన అధికారులే సదరు నిర్మాణదారునికి సున్నం వేసుకుని నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తూ ప్రొత్సహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.