నీట్ పరీక్షను రద్దు చేయాలి

by Sridhar Babu |
నీట్ పరీక్షను రద్దు  చేయాలి
X

దిశ,ఉప్పల్ : నీట్ పరీక్షను రద్దు కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ను ముట్టడించారు. దాంతో ఆ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు నీట్ పరీక్ష అవకతవకలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గవర్నర్ చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. వెంటనే నీట్ పరీక్ష ను రద్దు చేయాలన్నారు. దీనిపై వెంటనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించక పోతే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నీట్ పరీక్ష

అక్రమాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని భావిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి స్పందించకపోతే వారి కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ జనాభా 23 కోట్లు ,నీట్ లో 1455 సీట్లు నేషనల్ పూలోకి వస్తున్నాయన్నారు. 3.8 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ 8340 సీట్లతో 1251 సీట్లు నష్టం జరుగుతుందని అందుకే నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్ సీట్స్ మాత్రమే కాకుండా డెంటల్, బీవీఎస్సీ వెటర్నరీ, ఆయుష్ లో అన్నింట్లో కూడా తెలంగాణ విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. తెలంగాణాలో దాదాపు 75 వేల మంది నీట్ పరీక్ష రాసిన వారి గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఆలోచించటం లేదని ధ్వజమెత్తరు. ఇప్పటికైనా నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story