- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MP Eatala : సనాతన ధర్మం అంటే ఫిలాసఫీ కాదు
దిశ, కాప్రా : సనాతన ధర్మం అంటే ఫిలాసఫీ కాదని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బ్రాహ్మణ సేవా సమైఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొన్నారు. ఆదివారం మల్లాపూర్ లోని వీఎన్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన బ్రహ్మణ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పరమేశ్వర్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల మాట్లాడుతూ భారతదేశం విశ్వగురు స్థానంలో ఉందని మనం ఎంత గర్వంగా చెప్పుకున్నామో, విదేశీయుల దురాక్రమణలు, దుర్మార్గాల వల్ల అది కనుమరుగైపోయిందన్నారు.
సమాజాన్ని, సక్రమంగా నడిపించే తత్వం మన ప్రాచీనత్వం అన్నారు. దానిని కాపాడే వాళ్లు బ్రాహ్మణులని, జ్ఞానాన్ని, మానవ సంబంధాల్ని, సమాజంలో ఎలా ఉండాలో నేర్పాలంటే ఇంట్లో తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు ఉండాలేకాని, వారిని అనాథాశ్రమంలో ఉంచే పద్ధతి సరైనది కాదన్నారు. పౌరోహిత్యమునే నమ్ముకొని గ్రామీణ ప్రాంతాలలో ఉండే బ్రాహ్మణులు ఎలా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నానమన్నారు. బ్రాహ్మణ పరిషత్ కు తమ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి , రాఘవ రెడ్డి, సాయి గౌడ్, మామిడ్ల రాజి రెడ్డి, సంతోష్ రెడ్డి, నెమలి అనిల్, బెల్లం శ్రీనివాస్, మహేష్ యాదవ్, కిట్టు, నూతులకంటి రాజు, నెమలి సునీల్ రెడ్డి, అమర్, సత్యం, రాజు గౌడ్, ఆటోమొబైల్ రాజు, జమీలా బేగం, కిషోర్, శ్రావణి, క్రాంతి రేవంత్, లీలావతి పాల్గొన్నారు.