మూడుచింతలపల్లి ఎంపీఓ సస్పెండ్..

by Kalyani |
మూడుచింతలపల్లి ఎంపీఓ సస్పెండ్..
X

దిశ, శామీర్ పేట: మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలో అదనపు కలెక్టర్ అభిషేక్ ఆగత్స్య శుక్రవారం ఆకస్మిక పర్యటన నిర్వహించారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రత్యేక పారిశుధ్య శిబిరాన్ని ఈ నెల 17వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ మూడుచింతలపల్లి మండలంలో ప్రత్యేక పారిశుధ్య శిబిరం నిర్వహించడం లేదు.

అలాగే ముఖ్యమైన ఈ కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం నిర్వహించి విజయవంతం చేయకుండా నిర్లక్ష్యం వహించి బాధ్యతారహితంగా ఆమె ప్రవర్తన ఉన్నందుకు పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 51 లోని సబ్ సెక్షన్ 19 ప్రకారం శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్డర్ అమలులో ఉన్నంత కాలం ముందస్తు అనుమతి పొందకుండా మండల పంచాయతీ అధికారి సునీత ప్రధాన కార్యాలయాన్ని వదిలి వెళ్లొద్దని తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎంపీఓ సునీత సస్పెన్షన్ లో కొనసాగుతుందని అందులో పేర్కొన్నారు.

Advertisement

Next Story