రాజీవ్ యువవికాసం పథకం అమలుపై ఎమ్మెల్యే హర్షం

by Sridhar Babu |   ( Updated:2025-03-17 14:52:19.0  )
రాజీవ్ యువవికాసం పథకం అమలుపై ఎమ్మెల్యే హర్షం
X

దిశ, తిరుమలగిరి : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగుల జీవనోపాధికై ఆర్థిక సహాయం పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాజీవ్ యువవికాసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగుల జీవనోపాధికి ఆర్థిక సహాయం చేసేందుకు ప్రవేశపెట్టారని, దీనిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడాలని ఆకాంక్షిం చారు. నియోజకవర్గానికి చెందిన అర్హులైన నిరుద్యోగులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అదే విధంగా భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిపే భగవాన్ మహావీర్ జన్మ కళ్యాణక్ ఆహ్వానపత్రికను కార్యక్రమ నిర్వాహకులతో కలిసి ప్రజాభవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు అందజేశారు.

Read More..

ప‌ర్యాట‌క అభివృద్ధిలో అన్ని జిల్లాల‌కు స‌ముచిత స్థానం క‌ల్పిస్తాం.. మంత్రి జూప‌ల్లి

Next Story

Most Viewed