బీఆర్ఎస్ తోనే కంటోన్మెంట్ అభివృద్ధి.. మంత్రి తలసాని

by Sumithra |
బీఆర్ఎస్ తోనే కంటోన్మెంట్ అభివృద్ధి.. మంత్రి తలసాని
X

దిశ, కంటోన్మెంట్/ బోయిన్ పల్లి : గులాబీ పార్టీతోనే కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందిత విజయం లాంఛనమే అని ధీమా వ్యక్తం చేశారు. గులాబీకి భారీ మెజారిటీ పక్కాయేనని, అయినా గులాబీ శ్రేణులు అలసత్వం లేకుండా మరింత కృషి చేయాలని సూచించారు. విపక్షాల మాయమాటలను ప్రజలెవ్వరూ నమ్మడం లేదన్నారు. ప్రజలందరి దీవెనలతో గెలిచేది తామేనని, పనులు చేసేది కూడా తామేనని వెల్లడించారు. ఈ మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గ ఎన్నికల పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై పార్టీ ముఖ్యనాయకులకు మంత్రి తలసాని కీలక సూచనలు చేశారు.

కేంద్రంలోని బీజేపీ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని మంత్రి తలసాని మండిపడ్డారు. తెలంగాణను అన్నిరంగాల్లోనూ అగ్రగామిగా నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దేనని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న చొరవతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరిగాయన్నారు. సాయన్న కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందితను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లాస్య నందితను సొంత బిడ్డగా భావించి, మద్దతు పలకాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ ల మాయమాటలు ప్రజలెవ్వరూ నమ్మడం లేదని, ఎన్నికల్లో విజయఢంకా మోగించేది బీఆర్ఎస్సేనని మంత్రి తలసాని తేల్చిచెప్పారు.

ఈ సందర్భంగా పలుదళిత సంఘాల నేతలు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. టీఎమ్మార్పీఎస్ తో పాటు మాలసంఘాల జేఏసీ నేతలు... తలసానితో కలిసి, మద్దతు ప్రకటించారు. గులాబీ పార్టీ వెన్నంటి ఉంటామని దళిత సంఘాల నేతలు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల బీఆర్ఎస్ కే తమ ఓటు అంటూ నినదించారు. ఈ కీలక భేటీలో సీనియర్ నాయకులు ఎంఎన్ శ్రీనివాస్, బెవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జెల నాగేశ్, కట్టెల శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, భాగ్యశ్రీ శ్యాంకుమార్, లోకనాథం, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరి, సీనియర్ నాయకులు ఆకుల హరి, టీఎన్ శ్రీనివాస్, నర్సింహ్మ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed