- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కీసర రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి సురేఖ
దిశ, మేడ్చల్ బ్యూరో : కార్తీక మాస మొదటి సోమవారం సందర్భంగా జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కీసర గుట్టలోని రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కీసరలో సామూహిక దీపొత్సవ కార్యక్రమాన్ని మంత్రి నిర్వహించారు. మంత్రి ధ్వజస్తంభం పై ఆకాశ దీపాన్ని వెలిగించి, అనంతరం దీపాలను నీటిలో వదిలారు.ఈ కార్యక్రమాలను మాధవానంద సరస్వతి స్వామి దగ్గరుండి మంత్రితో పూజ కార్యక్రమాలను నిర్వహింప జేసారు.
మంత్రితో పాటు దేవాదాయ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ , దేవాదాయ శాఖ కమిషనర్ ఈ పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి, కీసర ఆర్డీఓ సైదులు, తహాసీల్దారు, ఆలయ చైర్మన్ నాగలింగం, ఆలయ ఈఓ సుధాకర్ రెడ్డి, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.