మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి...

by S Gopi |   ( Updated:2022-08-30 12:48:49.0  )
మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి...
X

దిశ ప్రతినిధి, మేడ్చల్/ఫిర్జాదిగూడ: దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ పాగా వేయనున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నట్లు తెలిపారు. దమ్ముంటే ఆయా రాష్ట్రాలలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం మేడ్చల్ నియోజకవర్గంలోని కీసర, పోచారం, పిర్జాదిగూడలలో మంజూరైన ఆసరా ఫించన్లకు సంబంధించిన కార్డులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. కొంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా అందజేశారు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో మంత్రి మట్లాడుతూ... నియోజకవర్గంలో వైద్యం విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి ఎల్ఓసీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసి నిరుపేదల కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్ ను అందజేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాకముందు దరఖాస్తు ఇచ్చి దండంపెట్టినా గత పాలకులు పింఛన్లు ఇచ్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. కొత్తగా పింఛన్ రావాలంటే మరొకరి చావు కోసం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండేదన్నారు. స్వయం పాలనలో అర్హులైన అందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమన్నారు. అర్హులైన వారందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమలలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, ఫిరజాదిగూడ మెయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మెయర్ శివ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యానాయక్, ఎంపీపీ ఇందిరా లక్ష్మి నారాయణ, నాయకులు సురేందర్ రెడ్డి, రమేశ్, శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed