జిల్లాలో టాప్ మేడ్చల్.. పోల్ అయిన ఓట్లు 62.09 శాతం

by Sumithra |
జిల్లాలో టాప్ మేడ్చల్.. పోల్ అయిన ఓట్లు 62.09 శాతం
X

దిశ, మేడ్చల్ ప్రతినిధి : జిల్లాలో గురువారం జరిగిన పోలింగ్ లో మేడ్చల్ నియోజకవర్గం టాప్ లో నిలిచింది. సాయంత్రం ఐదు గంటల సమయం వరకు 54.62 శాతంగా పోల్ అయిన ఓట్లు పోలింగ్ ముగిసే సమయానికి 7.47 శాతం ఓట్లు అదనంగా నమోదు అయ్యి 62.09 శాతానికి పెరిగింది. అదేవిధంగా గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాలలో కూకట్పల్లి నియోజకవర్గంలో అత్యల్పంగా 42.6 శాతం ఓట్లు నమోదు అయినప్పటికీ పోలింగ్ ముగిసిన సమయానికి అది 53.96కు చేరింది. దీంతో జిల్లాలో నాలుగో స్థానం నిలువుగా ఉప్పల్ నియోజకవర్గంలో 51.35శాతం ఓట్లు నమోదు అయ్యి జిల్లాలో ఆఖరి స్థానంలో నిలిచింది.

పోలింగ్ నమోదు..

మేడ్చల్ నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 2.4 శాతం, 11 గంటల వరకు 15.31 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 28.25 శాతం, మధ్యాహ్నం మూడు గంటల వరకు 42.17 శాతం, సాయంత్రం ఐదు గంటల వరకు 54.62 శాతంగా నమోదయింది. పోలింగ్ ముగిసే సమయానికి 62.09 శాతంకు చేరింది.

మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 5.82 శాతం, 11 గంటల వరకు 14.21 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 26.9 శాతం, మధ్యాహ్నం మూడు గంటల వరకు 39.5 శాతం, సాయంత్రం ఐదు గంటల వరకు 46.8 శాతంగా నమోదయింది. పోలింగ్ ముగిసే సమయానికి 53.99 శాతంకు చేరింది.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 8.5 శాతం, 11 గంటల వరకు 14.2 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 28.7 శాతం, మధ్యాహ్నం మూడు గంటల వరకు 40.6 శాతం, సాయంత్రం ఐదు గంటల వరకు 52.8 శాతంగా నమోదయింది. పోలింగ్ ముగిసే సమయానికి 56.74 శాతంకు చేరింది.

కూకట్ పల్లి నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 5.32 శాతం, 11 గంటల వరకు 14.9 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 22 శాతం, మధ్యాహ్నం మూడు గంటల వరకు 32 74 శాతం, సాయంత్రం ఐదు గంటల వరకు 42.6 శాతంగా నమోదయింది. పోలింగ్ ముగిసే సమయానికి 53.96 శాతం కు చేరింది.

ఉప్పల్ నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 5 శాతం, 11 గంటల వరకు 15.1 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 26.1 శాతం, మధ్యాహ్నం మూడు గంటల వరకు 34.2 శాతం, సాయంత్రం ఐదు గంటల వరకు 46.2 శాతంగా నమోదయింది. పోలింగ్ ముగిసే సమయానికి 51.35 శాతంకు చేరింది.

Advertisement

Next Story

Most Viewed