- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఆ మంత్రికి సొంత ఆస్తులు పెంచుకోవడం పై ఉన్న శ్రద్ధ అభివృద్ధిలో లేదు'
దిశ, మేడ్చల్ టౌన్ : మల్లారెడ్డి మంత్రిగా ఉండి మేడ్చల్ నియోజకవర్గంలో తన సొంత ఆస్తులను పెంచుకోవడంలో పెట్టిన శ్రద్ధ అభివృద్ధి పై పెట్టలేదని మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ అన్నారు. శనివారం మేడ్చల్ మున్సిపాలిటీలో గడప గడప కు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మేడ్చల్ పట్టణంలో ఇంటిటి ప్రచారంలో పాల్గొని ఈ ఎన్నికల్లో ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్దించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మల్లారెడ్డి గెలిస్తే తన సొంత స్థలంలో ప్రభుత్వ కళశాల ఏర్పాటు చేస్తా అని హామీ ఇచ్చి గెలిచాక మరిచిపోయాడని విమర్శించారు.
మల్లారెడ్డి పై మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూని చేశాడని, డబ్బులతో ఏదైనా చేయొచ్చు అనే అహంకారంతో మల్లారెడ్డి వ్యవహరిస్తున్నడాని సుదీర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. మంత్రిగా మేడ్చల్ కు ఏమి చేశావు ఈ ఎన్నికల్లో గెలిస్తే ఏమి చేస్తావో చెప్పకుండ జోకర్ మాటలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాడని పేర్కొన్నారు. మల్లారెడ్డి సొంత కళాశాలను నడిపేందుకు మేడ్చల్ ప్రాంతంలో ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, రొయ్యల మల్లేష్ గౌడ్, కౌన్సిలర్ చాపరాజు, సాయి పేట శ్రీనివాస్, వెంకటేష్ , రవీందర్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, వేముల శ్రీనివాస్ రెడ్డి, గర్దాస్, రంజిత్, దాత్రిక రజిని తదితులున్నారు.