- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మల్కాజ్ గిరి ఈటలదే...సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ
దిశ,మేడ్చల్ బ్యూరో : దేశంలోనే అతిపెద్దదైన మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ అధిక్యతతో ఘన విజయం సాధించారు.సమీప కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పై ఈటల రాజేందర్ 3 లక్షల 91 వేల 655 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 9 లక్షల 91 వేల 42 ఓట్లతో విజయం సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి 5 లక్షల 99 వేల 567 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇకపోతే బీఆర్ఎస్ అభ్యర్థి 3 లక్షల 486 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తొలి రౌండ్ నుంచి చివరి వరకు ప్రతి రౌండ్ లోనూ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కంటే అధిక్యత కనబరిచారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో హస్తం పార్టీ కంటే అత్యధిక ఓట్లు సాధించారు.
పోస్టల్ బ్యాలెట్ లోనూ కమలం హవా..
లోక్ సభ పరిధిలోని పోస్టల్ బ్యాలెట్ లోనూ బీజేపీ తన హవా కొనసాగించింది. పోస్టల్ బ్యాలెట్ లో ఈటల రాజేందర్ కు 10 వేల 330 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ పార్టీకి 6 వేల 230 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక వెయ్యి 789 ఓట్లు వచ్చాయి.
సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. గత 2019 ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి సర్వ శుక్తులు వడ్డారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్ ను కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిపారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు ఎన్నికల భాత్యతను అప్పగించారు. అయినా దాదాపు నాలుగు లక్షల మెజారిటీ తో ఈటల గెలవడం కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరి లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దాదాపు నాలుగు లక్షల మెజారిటితో గెలుపొందడం పార్టీ శ్రేణులను కుంగదీస్తోంది.