మల్కాజిగిరి మేనిఫెస్టో రిలీజ్.. మోదీ గ్యారంటీ.. ఈటల ష్యూరిటీ పేరిట విడుదల

by Aamani |
మల్కాజిగిరి మేనిఫెస్టో రిలీజ్.. మోదీ గ్యారంటీ.. ఈటల ష్యూరిటీ పేరిట విడుదల
X

దిశ,మేడ్చల్ బ్యూరో : మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజేపి మేనిఫెస్టోను ‘ మోదీ గ్యారంటీ, ఈటల ష్యూరిటీ పేరుతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విడుదల చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచార వివరాలు, భారతీయ జనతా పార్టీ పథకాలతో పొందుపరిచిన క్యూఆర్ కోడ్ ను సైతం రిలీజ్ చేశారు. బుధవారం ఈటల రాజేందర్ జన్మదినాన్ని పురస్కరించుకొని శామీర్ పేట నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రంలో మేనిఫెస్టో, క్యూ.ఆర్ కోడ్ విడుదల చేశారు. ఈకార్యక్రమంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్ తో పాటు పలువురు బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఏడు అంశాలతో మేనిఫెస్టో విడుదల.. మోదీ గ్యారంటీ ఈటెల షూరిటీ పేరుతో పాంప్లెట్ విడుదల.

వికసిత మల్కాజ్గిరి, స్వచ్ఛ మల్కాజ్గిరి,స్కిల్డ్ మల్కాజ్గిరి,ఆరోగ్య- ఆయుష్మాన్ మల్కాజ్గిరి, ఆత్మ నిర్భర్ నారీశక్తి మల్కాజ్గిరి, డిజిటల్ మల్కాజ్గిరి, మేక్ ఇన్ మల్కాజిగిరి పేరుతో మేనిఫెస్టో..

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మే 13 వ తేదీన దేశవ్యాప్తంగా ఎన్నికల్లో భాగంగా ఎన్నికల శంఖారావాన్ని మల్కాజిగిరిలో ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారు. యావత్ తెలంగాణ మోదీ ఆలోచనతో 370 సీట్లకు పైగా బీజేపీ సొంతంగా గెలవాలనే నినాదాన్ని నిజం చేయాలని.. దాంట్లో మల్కాజిగిరి కూడా ఉండాలని చెప్పి వారు సమర శంఖం పురించినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుడిగా నా చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడుతుందన్నారు. తొలి ఆర్థిక మంత్రిగా, కరోనా సమయంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసిన విషయాన్ని పరిశీలించారు.మల్కాజ్గిరిలో పార్లమెంట్ అభ్యర్థిగా నేను మీ ముందుకి వచ్చాను. ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ నిరుద్యోగం.భారత ప్రభుత్వ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో మేక్ ఇన్ ఇండియా, మేడిన్ ఇండియా నినాదంతో ఈ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఈటల స్పష్టంచేశారు.

హైదరాబాద్ లో పేదవారికి స్థలం కొనే భాగ్యం లేకుండా పోయింది. సొంత ఇంటి కలగానే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం 2 లక్షల 37 వేల ఇళ్లు మంజూరు చేసిన వాటిని నిర్మించి పేదలకు పంచడంలో గత ప్రభుత్వం విఫలమైంది. పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం హైదరాబాదుకు వచ్చిన పేదలతో సహా ఇక్కడ ఉండేవారికి సొంత ఇంటి కల నెరవేర్చడంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా కృషి చేస్తాను అని హామీ ఇస్తున్నట్లు తెలిపారు.

వైద్యం మీద పెట్టే ఖర్చు అనుకోకుండా వచ్చి పడే పిడుగు లాంటిది. పేదవారికి వైద్య అవసరాల కోసం డబ్బులు లేక అప్పులు చేసి వైద్యం చేయించుకోవడం మనుషులను పోగొట్టుకోవడం జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ , ఎయిమ్స్ తో పాటు వైద్య సౌకర్యాల కల్పనలో మరింత చేరువ చేస్తానని ఈటల హామీ ఇచ్చారు. స్థానికంగా డ్రైనేజ్ , రోడ్లు, ట్రాన్స్పోర్ట్ అస్తవ్యస్తంగా ఉన్నాయి. కేంద్రంలో మోడీ సర్కారు ఉంది కాబట్టి దరఖాస్తు పెట్టి దండం పెట్టే అవసరం లేకుండా మీ బిడ్డగా వాటిని పరిష్కారం చేస్తానని ఈటల స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed