మైసమ్మ చెరువు సమగ్ర విచారణ చేపట్టాలి

by Sridhar Babu |

దిశ, కూకట్​పల్లి : కూకట్​పల్లి నియోజకవర్గం పరిధిలో చెరువుల సమగ్ర విచారణకు డిమాండ్​ పెరుగుతుంది. హైడ్రా యాక్షన్​లోకి దిగిన వెంటే అన్ని పార్టీల నాయకులు, పర్యావరణ ప్రేమికులు కూకట్​పల్లి నియోజకవర్గం పరిధిలో కనుమరుగు అవుతున్న చెరువులను పరిరక్షించేందుకు రావాలని, కూకట్​పల్లి వైపు కన్నెతి చూడండి సార్​ అంటూ హైడ్రా కమిషనర్​ రంగనాథ్​కు ట్విట్టర్​ వేదికగా సైతం విన్నవించుకుంటుండటం విశేషం.

ఈ క్రమంలో మూసాపేట్​ కార్పొరేటర్​ కొడిచర్ల మహేందర్​ హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ను కలిసి కూకట్​పల్లి నియోజకవర్గంలో 2010లో నిర్వహించిన చెరువుల సర్వే, అప్పటి రికార్డులను తిరగేసి చెరువులకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని, ప్రజలకు స్వచ్ఛమైన జలాశయాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

రెవెన్యు రికార్డుల ప్రకారం 227 ఎకరాలు

కూకట్​పల్లి గ్రామం పరిధిలోని 893 ప్రభుత్వ భూమి, ప్రైవేటు సర్వే నంబర్​లు 906,907,905,903,902,901,904,900,899, 898,896,892/ఏ, 892/ఏఏ, 894,895, మూసాపేట్​ గ్రామం పరిధిలోని 72, 71, 70, 63, 62, 61, 60, 64, 66, 65, 59, 58, 57, 56, 50, 49, 48, 47, 46/ఏ, 46/సి, 46/డి, 46/బి, 45, 44, 43, 42, 41, 40, 92, 93, 94, 95,96,97,98,104,105,106,107,108,103, అల్లాపూర్​ గ్రామం పరిధిలోని 50,51,52 సర్వే నంబర్​లలోని 182.10 ఎకరాల భూమి ఎఫ్​టీఎల్​ పరిధిలో ఉండగా సర్వే నంబర్లు 49,50, 51,52,54,56,57,64,66,69,73,74,99,102,103, 104,892 సర్వే నంబర్​లు బఫర్​ జోన్​ పరిధిలో ఉన్నట్టు రెవెన్యు రికార్డులో నమోదై ఉంది. కూకట్​పల్లి, మూసాపేట్​, అల్లాపూర్​ గ్రామాల మధ్య సుమారు 227 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ప్రస్తుతం 83 ఎకరాల వరకు మాత్రమే మిగిలి ఉన్నట్టు ఇరిగేషన్​ అధికారులు చెబుతున్నారు.




279 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్టు రికార్డులు ఉన్నాయి : కొడిచర్ల మహేందర్​, కార్పొరేటర్​, మూసాపేట్​ డివిజన్

మూసాపేట్​, కూకట్​పల్లి, అల్లాపూర్​ గ్రామాల సర్వే నంబర్​లతో కూడిన మైసమ్మ చెరువు 2010 రికార్డుల ప్రకారం 138.29 ఎకరాలు ప్రభుత్వ భూమి, 141.08 ఎకరాల పట్టా భూములను కలుపుకుని సుమారు 279.37 ఎకరాల విస్తీర్ణంలో మైసమ్మ చెరువు ఉండేది. ముళ్ల కత్వ చెరువు, కాముని చెరువు, మైసమ్మ చెరువులు గొలుసు కట్టు చెరువులు. కాముని చెరువు, మైసమ్మ చెరువు మధ్య నిండుగా వాటర్​ బాడి ఉండేది.

బడా నిర్మాణ సంస్థలకు కొమ్మ కాస్తూ అధికారులు రికార్డులను తారు మారు చేసి 2010 తరువాత మళ్లి మ్యాప్​లను సృష్టించి పాత లెక్కలను ఎగరగొట్టారు. అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటే నిజమైన లెక్కలు బయటికి వస్తాయి. 2010 సంవత్సరంలో లోక్​సత్తా అధినేత జయప్రకాశ్​ నారాయణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చెరువుల సర్వే చేశారు. అంతే కాకుండా గోకుల్​ సొసైటీ సమీపంలో ఉన్న అలావుద్దీన్​ కుంటను పూర్తిగా రికార్డుల నుంచే తొలించిన ఘనత అధికారులది.

Advertisement

Next Story