ఉప్పల్ లో ప్రియురాలి పై ప్రేమికుడు కత్తితో దాడి

by Kalyani |
ఉప్పల్ లో ప్రియురాలి పై ప్రేమికుడు కత్తితో దాడి
X

దిశ, ఉప్పల్: ఉప్పల్ లో ప్రియురాలి పై ప్రేమికుడు కత్తితో దాడి చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సెక్టర్ ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం… భువనగిరికి చెందిన కే. భావన (20),సాయి కుమార్(24)భావన మొయినాబాద్ లో విఆర్కే మహిళా కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతోంది. ఇరువురు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కొన్ని రోజులుగా భావన,సాయి కుమార్ తో దూరంగా ఉంటుంది.

సాయంత్రం కాలేజ్ బస్సులో భావన ఇంటికి వస్తున్న క్రమంలో ఉప్పల్ రింగ్ రోడ్ లో బస్ దిగి సాయికుమార్ కలిసింది. భావన దగ్గర ఉన్న సెల్ ఫోన్ సాయికుమార్ లాక్కొని సోషల్ మీడియా అకౌంటును చెక్ చేస్తున్నాడు. తన ఫోను తీసుకునే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా భావనపై సాయికుమార్ కత్తితో దాడి చేయగా యువతి ఎడమ చేతి చిటికెన వేలికి స్వల్ప గాయం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వెంటనే భావనను ఆస్పత్రికి తరలించారు. సాయి కుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Next Story