- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉందాం : ఎమ్మెల్యే
దిశ, కూకట్పల్లి : కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, ముఖ్యనాయకులతో సోమవారం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆయా డివిజన్లలో ప్రజా సమస్యల పై దృష్టి సారించాలని అన్నారు. ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. డివిజన్లలో ఎక్కడైనా రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉంటే తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కరించే దిశగా పూర్తి స్థాయి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని కోరారు.
హైడ్రాకి సంబంధించి ప్రజలలో భయం ఏర్పడిందని, హైడ్రా భయాన్ని ప్రజల నుంచి తొలగించే బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని అన్నారు. అదే విధంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా వేడుకలకు ఎక్కడ ఆటంకం కలగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతినిత్యం ప్రజా శ్రేయస్సు కోసమే పోరాడుతూ బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, మందాడి శ్రీనివాసరావు, సబీహ బేగం, పండాల సతీష్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు తూము శ్రావణ్ కుమార్, బాబురావు, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు గౌసుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.