ఎన్నికల కోడ్‌ను పక్కగా అమలు చేద్దాం : జిల్లా కలెక్టర్

by Aamani |   ( Updated:2023-10-09 12:51:30.0  )
ఎన్నికల కోడ్‌ను పక్కగా అమలు చేద్దాం : జిల్లా కలెక్టర్
X

దిశ ప్రతినిధి,మేడ్చల్ : ఎన్నికల నియమావళిని పక్కగా అమలు చేద్దామని మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. సోమవారం నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో కలెక్టరేట్ లో నోడల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ మాట్లాడుతూ...తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమాళిని వివిధ పార్టీలు తూచా తప్పకుడా పాటించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమాళికి లోబడి ఎన్నికల సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికCollector Medchal Malkajgiriల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ఎన్నికలు ముగిసే వరకు అధికారులు బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహించాలని కోరారు. సమస్యాత్మక , అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం వంటి తదితర పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేయాల్సిందిగా కలెక్టర్ అమోయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో నోడల్ అధికారులకు కలెక్టర్ అమోయ్ కుమార్ పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, నోడల్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed