- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్లెల్లో నిధుల కొరత
దిశ, మేడ్చల్ బ్యూరో : నిధుల లేమీతో పల్లెలు అరిగోస పడుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో అభివృద్ది పనులు, మరమ్మతులకు ఆటంకం కలుగుతోంది. సర్పంచుల పదవీ కాలం ముగిసి ఆరు నెలలు దాటింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. సర్పంచుల పదవులు ముగిసే నాటికి ఖాతాల్లో సున్నా నిల్వలున్నాయి. దీనివల్ల పంచాయతీ సిబ్బందికి రెండు,మూడు
నెలలుగా వేతనాలు చెల్లించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటి కాయ పడ్డ చందంగా కాంగ్రెస్ సర్కార్ స్వచ్చదనం- పచ్చదనం కార్యక్రమానికి శ్రీ కారం చుట్టింది. ప్రతి రోజూ స్వచ్చదనం...పచ్చదనం కార్యక్రమం నిర్వహణకు రూ. వేలల్లో ఖర్చవుతోంది. ఈ భారమంతా పంచాయతీ సెక్రటరీలపై పడుతుండడంతో..స్వచ్చదనం..పచ్చదనం తూతుమంత్రంగా సాగుతోంది.
నిధులలేమితో ఇక్కట్లు..
మేడ్చల్ జిల్లాల్లో 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి చివరలో సర్పంచ్ ల పదవీకాలం ముగిసింది. చాలా గ్రామ పంచాయతీలలో సర్పంచులే అభివృద్ది పనుల కోసం ఖజానాలు ఖాళీ చేసి వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన కొద్దిపాటి నిధులతో కార్మికుల వేతనాలు, నిర్వహణ పనులు చేపడుతూ వచ్చారు. అయితే రెండు, మూడు నెలలుగా గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు చేల్లించలేని పరిస్థితి నెలకొందని పలువరు గ్రామ కార్యదర్శులు వాపోతున్నారు. చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లలో డీజిల్ పోయలేని పరిస్థితులు ఏర్పాడ్డాయని చెబుతున్నారు.
కొందరు పెట్రోల్ బంకుల్లో అరువుపై డీజిల్ పోయించుకుని ట్రాక్టర్లు నడుపుతున్నారు. నిధుల లేమితో చెల్లింపుల్లో జాప్యం కారణంగా వాటిని నడపలేకపోతున్నారు. కొందరు గ్రామ పంచాయతీ నిర్వహణ కోసం అప్పులు చేసి, వాటిని తిరిగి సకాలంలో చెల్లించలేక డ్యూటీలకు డుమ్మా కొడుతున్నట్లు తెలుస్తోంది. పన్నులు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తున్నా.. తిరిగి గ్రామాలకు ఇవ్వడంలేదని సెక్రటరీలు వాపోతున్నారు. 15 వ ఆర్థిక సంఘం గ్రాంట్ కూడా కేంద్రం నుంచి రావడంలేదు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామాల్లో తీర్మానాలు చేసే పరిస్థితి లేనందున కేంద్రం 15వ ఫైనాన్స్ నిధులు విడుదల చేయడంలేదంటున్నారు. ఇకపోతే ప్రత్యేక అధికారుల పాత్ర నామమాత్రమే అనే విమర్శులున్నాయి.
తూతూమంత్రంగా ...
గ్రామాల్లో నిధుల కొరత వల్ల ఒకవైపు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా,మరోవైపు స్వచ్ఛదనం.. పచ్చదనం కార్యక్రమ నిర్వహణ కోసం కార్యదర్శుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు రోజుకు రూ.10 నుంచి రూ.50 (వీఐపీలు హాజరైతే)వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. ప్లెక్సీలు, గ్రీన్ రిబ్బన్ లు,అల్పహారం, టెంట్లు ఇతరాత్ర అవసరాల కోసం గ్రామ పంచాయతీ చెక్కులు ఇస్తామంటే నమ్మడం లేదని వాపోతున్నారు. దీంతో పచ్చదనం.. స్వచ్చదనం కార్యక్రమాన్ని తూతూమంత్రంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో స్వచ్చదనం, పచ్చదనం కార్యక్రమం విజయవంతం కాకపోవడడమే కాకుండా అబాసు పాలవుతోంది.
- Tags
- funds