- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kukatpally MLA : రంగధాముని చెరువు అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలి
దిశ, కూకట్పల్లి: రంగధాముని చెరువు అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం అధికారులతో కలిసి రంగధాముని చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ చెరువు అభివృద్ధి పనులలో భూములు కోల్పోయిన రైతులను పిలిచి వారికి తగిన నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అదే విధంగా గత కొంత కాలంగా తమ భూములలో పైప్లైన్ పనులు, ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్ పనులు చేపడుతుండటంతో పట్టా దారులు భయపడుతున్నారని, భూ యజమానులు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం నష్టపరిహారం కింద భూములు కోల్పోతున్న వారికి టీడీఆర్ఎస్ ఇస్తుందని, అది ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు.
సుమారు రూ. 19 కోట్ల వ్యయంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. కొంత వరకు పనులు పూర్తి కాగా మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రంగధాముని చెరువు అభివృద్ధి పనులు పూర్తి అయితే చెరువు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేసుకునేందుకు వీలుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ బాబురావు, డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.