- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kukatpally MLA : అధికారుల నిర్లక్ష్యంతోనే అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుంది
దిశ,కూకట్పల్లి: అధికారుల నిర్లక్ష్యంతోనే అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలాజీ నగర్ డివిజన్ పరిధిలోని ధనలక్ష్మి సెంటర్లోని నేతాజీ పార్కును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నేతాజీ పార్క్ అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని, అధికారులు నిర్లక్ష్యం కారణంగానే పనులు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్క్ లో పారిశుధ్యం, విద్యుత్, సివిల్ పనులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. స్థానికులు ఫిర్యాదుల మేరకు పార్కును సందర్శించడం జరిగిందని అన్నారు.
గత కొన్ని నెలలుగా నేతాజి పార్క్ నందు పనుల్లో అధికారులు జాప్యం చేస్తున్నారని, అధికారులు అలసత్వం తోనే పనుల్లో పురోగతి లేదని అన్నారు. పార్క్ లో వాకింగ్ చేసుకుని వారు వాకింగ్ ట్రాక్ సరిగా లేక ఇబ్బంది పడుతున్నారని, పార్క్ లో విద్యుత్ దీపాలు వెలగడం లేదని అన్నారు. అధికారులు అన్ని శాఖలను సమనయ్వం చేసుకుని పార్క్ లో అభివృద్ధి పనులు చేపట్టి, సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ బాబురావు, మూసాపేట్ సర్కిల్ ఇంజనీరింగ్ విభాగం డీఈ శ్రీదేవి, ఏఈ శ్రీనివాస్, యూ బీడీ అధికారి విజయ రాణి, బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.