వేడుకలు చేద్దాం.. మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం : కేటీఆర్

by Disha Web Desk 23 |
వేడుకలు చేద్దాం.. మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం : కేటీఆర్
X

దిశ,మేడ్చల్ బ్యూరో: వలస పక్షులకు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత మీకు కనబడరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని మల్కాజిగిరి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే కనిపించకుండా పోయారని ఏద్దేవా చేశారు. బుధవారం మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా కేటీఆర్ దొంగల మైసమ్మ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడిలపై నిప్పులు చెరిగారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో స్వల్ప మెజారిటీతో గెలిచినట్లు గుర్తు చేశారు. కొడంగల్ లో ఓడిపోయిన రేవంత్ రెడ్డిని మల్కాజిగిరి ఓటర్లు అక్కున చేర్చుకొని గెలిపించి ఈ నియోజకవర్గ ప్రజలు రేవంత్ కు ఎంతో ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ, సీఎం పదవులు రావడానికి కారణం మల్కాజిగిరి ప్రజలేన కేటీఆర్ స్పష్టం చేశారు. అలాంటి మల్కాజిగిరిని రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని, ప్రజలకు కష్టం వస్తే కనపడకుండా పోయాడని, కనీసం పార్లమెంట్ లో కూడా మల్కాజిగిరి సమస్యలపై తన వాణి వినిపించలేదని మండి పడ్డారు.

ఈ పార్లమెంట్ ఎన్నికలు పదేళ్లు కేసీఆర్ చేసిన అభివృద్దికి.. వంద రోజుల్లో రేవంత్ రెడ్డి ఆడిన అబద్దాలకు రెఫరెండమని కేటీఆర్ అన్నారు. బడే భాయ్ మోదీ మనకు ఢిల్లీలో బడా మోసం చేసిండని ద్వజమెత్తారు. చోట భాయ్ రేవంత్ రెడ్డి మనల్ని ఇక్కడ హమీల పేరిట మోసం చేసిండని మండిపడ్డారు.వంద రోజుల్లో అందరికీ అన్ని చేస్తా అంటూ చోటా భాయ్ మోసం చేసి గద్దెనెక్కి నట్లు తెలిపారు. గద్దెనెక్కిన వెంబడే రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ అయ్యిందా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. తులం బంగారం వచ్చిందా..? మహిళలకు రూ. 2500 వచ్చాయా..? అని ప్రశ్నించారు. పైన పెద్ద మోసగాడు మోదీ అని,..కింద చిన్న మోసగాడు రేవంత్ అని మండి పడ్డాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అమలు కానీ అరు గ్యారెంటీలతో మోసం పార్ట్ 1 అనే సినిమా చూపించండని..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు మోసం పార్ట్ 2 సినిమా చూపిస్తున్నాడని ఆరోపించారు.

ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ల మీద ఒట్టు వేసి రుణమాఫీ చేస్తా అంటున్నాడు.పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 32 ఫ్లైఓవర్లను కడితే, కనీసం బీజేపీ బిజెపి మూడు కూడా కట్టలేకపోయిందని విమర్శించారు. ఆ పార్టీకి ఓటు వేసే వారికి సిగ్గుండాలని ఘాటుగా విమర్శించారు. శ్రీరామనవమి ,హనుమాన్ జయంతి వేడుకలను మనం కూడా చేద్దామని మొక్కుదామని.. బీజేపీని తొక్కుదామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లు గెలిస్తే కేంద్రంలో రాజకీయాలని శాసిస్తామని 37 లక్షల కోట్లున్న నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కలవలేము కాబట్టి అందరూ టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపి ఓటు వేయాల్సిందిగా ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు.కార్యక్రమంలో మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు మాధవరం క్రిష్ఱారావు, కేపీ వివేకానంద, బీ. లక్ష్మారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

నామినేషన్ దాఖలు చేసిన లక్ష్మారెడ్డి..

మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం మేడ్చల్ కలెక్టర్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద,మాధవరం క్రిష్ణారావులతో కలిసి ఎన్నికల అధికారి గౌతమ్ కు తన నామినేషన్ పత్రాలను రాగిడి అందజేశారు. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరి బీఆర్ఎస్ కు అడ్డా అని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు పార్లమెంట్ లోని ఏడు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీకే కట్టబెట్టారని, వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ఓటేసి తనను గెలిపించాలని విజ్ఠప్తి చేశారు.



Next Story

Most Viewed