- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kodali Nani: మాధవ్ దాన్ని పట్టుకుని వదలరా..?:కొడాలి నాని
దిశ, వెబ్‌డెస్క్: Kodali Nani Slams TDP Leaders On MP Madav's Video| రాష్ట్రంలో ఏసమస్యలు లేవనట్టుగా ఎంపీ మాధవ్ విషయాన్ని టీడీపీ పదే పదే చెప్తూ రాద్దాంతం చేస్తోందని వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.మాధవ్ లాంటి వీడియోలు ఇంటర్ నెట్‌లో వేల కొద్దీ దొరుకుతాయని కావాలంటే అవి చూసుకోవచ్చంటూ ఎద్దేవా చేశారు. ఆడమగ అనే తేడా లేకుండా పదేపదే ప్రెస్‌మీట్‌లు, పెడుతూ మాధవ్ వీడియో పై పరితపించి పోతున్నారని విమర్శించారు. జగన్‌ను బ్రష్టు పట్టించాలనే మాధవ్ విడియోపై ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాలకు అన్ని అందుబాటులో ఉండేందుకు జగన్ పరితపిస్తున్నారని తెలిపారు. వైసీపీ పార్టీపై నిందలు మోపేందుకు టీడీపీ నేతలు బ్రోకర్లుగా మారి అమ్మాయిలను ఎరవేస్తునారని ఆరోపించారు. మాధవ్ వల్ల ఇబ్బంది పడినట్టు ఇప్పటి వరకు ఏ మహిళా ఫిర్యాదు చేయలేదన్నారు. అయితే చంద్రబాబును రాయడానికి వీలులేని పదజాలంతో నానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ చిన్న కూతురి మృతిని డైవర్ట్ చేసేందుకు మాధవ్ వీడియోను తెరపైకి తెచ్చారని నాని తెలిపారు.
ఇది కూడా చదవండి: 75 ఏళ్లలో తిరుగులేని విజయాలు సాధించాం:సీఎం జగన్
- Tags
- Kodali Nani