- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెరువుల్లో పెద్దల భవనాలు కూల్చడం మంచిదే.. ఈటల రాజేందర్ వ్యాఖ్యలు
దిశ, మేడ్చల్ బ్యూరోః చెరువు కన్నతల్లిలాంటిదని, కానీ ఇప్పుడు ఆ చెరువులను మాయం చేస్తున్నారని.. అలాంటి స్థలాల్లో కట్టిన పెద్దల భవనాలను కూల్చడం మంచిదే అని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హైటెక్ సిటీ వద్ద ఉన్న నాళాలు.. ఫిరంగినాలా మాయమైనట్లు తెలిపారు. భూముల ధరలు పెరగడంతో నదుల పక్కన ఉన్న పట్టా భూముల్లో భవనాలు వెలిసినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలకు సోయి ఉంటే నదుల, చెరువుల పక్కన ఉన్న పట్టా భూములు సేకరించి నష్టపరిహారం చెల్లించి ఉంటే ఈరోజు ఈ ఆక్రమణలు జరిగి ఉండేవి కావని ఈటల అభిప్రాయం వ్యక్తంచేశారు. హైదరాబాద్ తో అక్రమంగా కట్టుకున్న పెద్దల కట్టడాలు కూల్చడం సంతోషమే.. కానీ సామాన్యులను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.. హీరో లాగా ఫోజులు కొట్టే పద్ధతి మంచిది కాదని హితువు పలికారు. మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన సభ్యత్వ నమోదులో ఈటల రాజేందర్ హాజరై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. చట్టాలు చేసే ఎమ్మెల్యేలే వ్యాపారవేత్తలు అయితే జరిగేనష్టం చాలా ఉంటుందన్నారు. సరూర్ నగర్ చెరువు పక్కన ఉన్న భూముల్లో 5 ఎకరాలు వివాదం ఉంటే ఒకే సర్వే నంబర్ కింద ఉందని 100 ఎకరాల పరిధిలో కట్టిన బిల్డింగ్స్ అన్నీ బ్లాక్ లో పెట్టారని అన్నారు. ఆ అపార్ట్మెంట్స్ బిల్డర్లు అమ్ముకోలేక, బ్యాంక్ రుణం తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎఫ్ టిఎల్ అనగానే ప్రభుత్వ భూమి కాదని, అందులోనూ పట్టా భూములు ఉన్నాయని, వీటిమీద కూడా చర్చ జరగాలని స్పష్టంచేశారు. శంషాబాద్ విమానాశ్రయం, ఐటికి ఇచ్చిన భూములు, కట్టిన టవర్లు111 జీవో పరిధిలో ఉన్నాయి. కానీ 111 జీవో పరిధిలో కట్టిన ప్రతి నిర్మాణం అక్రమం అంటున్నారని గుర్తు చేశారు. దీంతో 111 జీవోను సమీక్షించాల్సిన అవసరం ఉందని.. ఈ జీవోను రాజకీయపరంగా వాడుకోవద్దని సూచించారు. దేవరయంజాల్ భూములు దేవాలయ భూములు అని ఆరోపిస్తే వేసిన కమిటీలు అన్నీ దేవాలయ భూముల కావని తేల్చాయని ఈటల గుర్తు చేశారు. కాంగ్రెస్ కొత్తగా పుట్టిన పార్టీ కాదన్నారు. అదే ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో కట్టుకొన్న ఇళ్లను ఎల్ బి నగర్, ఉప్పల్ లో ప్రభుత్వ భూమి, వక్ఫ్ భూములు అని నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తున్న పని గొప్ప పనని సమర్ధిస్తే ప్రమాదమని హెచ్చరించారు. 30 ఏళ్ల క్రితం పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వ భూమి అంటే ఎలా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ ఎందుకు ఇచ్చారని నిలదీశారు. పేదల భూముల జోలికి వస్తె ఊరుకోబోమని, ఏకపక్షంగా వ్యవహరిస్తే గొంతెత్తాలని ఈటల పిలుపునిచ్చారు.
రక్త సంబంధం కంటే పార్టీ గొప్పది...
పార్టీ సంబంధం, రక్త సంబంధం కంటే గొప్పదని ఈటల స్పష్టం చేశారు. త ఎన్నికల్లో 35 శాతం ఓట్లు మనకు వచ్చాయని తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంటులో బీజేపీకి 10 లక్షల ఓట్లు వేశారు. ఒక్క ఎల్బీ నగర్ లోనే 1 లక్షా 77 వేల ఓట్లు వచ్చాయి. సభ్యత్వ నమోదులో కూడా ముందుండాలని కోరుతున్నానని అన్నారు. కార్యక్రమంలో నాయకులు సామా రంగారెడ్డి స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.