MLA: ప్రజలకు ఇబ్బంది కలగకుండా మౌలిక వసతులు కల్పించాలి

by Kalyani |
MLA: ప్రజలకు ఇబ్బంది కలగకుండా మౌలిక వసతులు కల్పించాలి
X

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లి నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు​ కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ… ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గం పరిధిలోని పలు చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయని, డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. తాగునీటి పైప్​లైన్​ సరిగా లేక తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని అన్నారు. అధికారులు రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూకట్​పల్లి ఈఈ గోవర్ధన్, మూసాపేట్​ ఈఈ శ్రీనివాస్, డిఈఈలు శ్రీదేవి, శంకర్, జలమండలి జీఎం ప్రభాకర్​, డీజీఎం నాగప్రియ, మాజీ కార్పొరేటర్​ బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed