అసెంబ్లీలో మా గొంతు నొక్కేశారు: ఈటెల రాజేందర్

by Shiva |
అసెంబ్లీలో మా గొంతు నొక్కేశారు: ఈటెల రాజేందర్
X

కేసీఆర్ ది పచ్చి ఫ్యూడల్ భావజాలం

దిశ, మహబూబ్ నగర్: అసెంబ్లీ ప్రజాస్వామ్య పత్రిక, తెలంగాణ ప్రజల భవిష్యత్తు రాసే వేదిక, అక్కడ మా గొంతు నొక్కేశారని, అందుకే ప్రజా వేదికలకు వచ్చామని బీజేపీ సీనియర్ నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.మంగళవారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపం వద్ద ప్రజా వ్యవసాయం, బీజేపీ భరోసా పేర జరిగిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 'ధరణి' పేదల కొంపలు ముంచే పోర్టల్ అని పేర్కొన్నారు.

ఎప్పుడో నిరుపేదలు దొరల దగ్గర భూములు కొని దున్నుకుంటున్న వాటిని మళ్లీ దొరల పేరు మీదకు ఎక్కాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గానికి కారకుడు కేసీఆర్ అని, ఆయనది పచ్చి ఫ్యూడల్ భావ జాలమని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రం ఏర్పడితే పేదల బ్రతుకులు మారుతాయనుకుంటే, నిరుపేదలను మరింతగా బిచ్చగాళ్లను చేసిన వ్యక్తి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో తాను ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే, అది చిన్న విషమని కోడి గుడ్డు మీద ఈకలు పీకొద్దని మాట్లాడారని తెలిపారు.

రాష్ట్రంలో దళితులకు కనీస గౌరవం కూడా దక్కడం లేదని, అందుకు నిదర్శనం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలే నని ఆయన ఉదహరించారు. కేసిఆర్ సర్కార్ దుర్మార్గాలకు పంచాయతీల్లో బిల్లులు రాక సర్పంచ్ లు కాంట్రాక్టర్లు, ఉద్యోగాలు రాక యువత, అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారని 2023 ఎన్నికల్లో గెలిచేది ఆ పార్టీయే అని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, ఎన్.పి‌ వెంకటేష్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story