- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోము : కూకట్పల్లి ఎమ్మెల్యే
దిశ, కూకట్పల్లి: బీసీ కుల గణన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం లో నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి లోని ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం కూకట్పల్లి సర్కిల్ డీసీ, ప్రాజెక్ట్ అధికారి ఇంద్రసేనాలు కుల గణన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొదటి సారిగా బీసీ కుల గణన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
కానీ కుల గణన కార్యక్రమంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. 66 పేజీల కుల గణన ఫాంలో కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇంట్లో ఏసీ, వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్, బ్యాంక్ అకౌంట్, ఆస్తులు అన్ని వివరాలు సేకరించడం ఎందుకో కూడా వివరించాలని డిమాండ్ చేశారు. కుల గణన కార్యక్రమంపై ముందుగా అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం కేబినెట్‌కు ఉందని అన్నారు. అన్ని వివరాలు సేకరించిన తరువాత ఆస్తులు ఉన్నాయి కాబట్టి సంక్షేమ పథకాలు రావు అని ఎక్కడ మెలిక పెడతారో, డబుల్ బెడ్ రూం ఇండ్లు రావు, పించన్లు రావు, రేషన్ కార్డులు ఇవ్వరు అన్న భయంలో ప్రజలు ఉన్నారు. ప్రజలు మా వద్దకు వచ్చి అడిగిన వారికి వివరించే చెప్పడానికి తమకు సైతం కుల గణన విధి విధానాలపై అవగాహన లేదని అన్నారు. ముందుగా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో అధికారులైన సమావేశం నిర్వహించి వివరించాల్సి ఉండేనని అన్నారు. కుల గణనపై స్పష్టమైన చర్చ జరిగిన తరువాత నిర్వహించి ఉంటే ప్రజలు భయ భ్రాంతులలో ఉండే వారు కాదని అన్నారు.
ఆలస్యం అయిన సరే జిల్లాల వారిగా కుల సంఘాల పెద్దలతో సమావేశాలు నిర్వహించి ఒక్కో జిల్లా వారిగా కుల గణన ప్రారంభించి ఉంటే బాగుండేదని అన్నారు. కుల గణన పేరుతో బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, బీఆర్ఎస్ తరఫున అడ్డుకుంటామని అన్నారు. కుల గణనతో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం అవకుండా నిర్వహించాలని కోరారు. అదే విధంగా ఎస్సీ వర్గీకరణ నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, డీసీ కృష్ణయ్య, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, ప్రాజెక్ట్ అధికారి ఇంద్రసేన, డివిజన్ అధ్యక్షుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.