- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆల్విన్ కంపెనీలో కార్మికునిగా పని చేశాను: ఎమ్మెల్యే కృష్ణారావు
దిశ, కూకట్పల్లి: ఆల్విన్ కంపెనీలో కార్మికునిగా పని చేశానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గుర్తు చేశారు. మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా కేపీహెచ్బీ కాలనీలో కార్మికుల కోసం రూ. 50 లక్షల వ్యయంతో చేపడుతున్న కార్మిక భవనాన్ని నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన జీవితం సాధారణ కార్మికునిగా ప్రారంభించానని, ఆల్విన్ కంపెనిలో కార్మికునిగా పని చేశానని, కార్మికుల కష్ట నష్టాలు తెలిసిన వాడినని అన్నారు. కేపీహెచ్ బీ డివిజన్ పరిధిలోని రమ్య గ్రౌండ్స్ వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే సందర్భంగా నిర్వహించిన వేడుకలలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో రెండు వందల మంది కార్మికులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం రమ్య గ్రౌండ్లో కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మందలపు సాయిబాబా చౌదరి, రాజేష్, పాతూరి గోపి తదితరులు పాల్గొన్నారు.