ప్రైమార్క్ పై చర్యలకు హైడ్రా యాక్షన్ ప్లాన్

by Kalyani |
ప్రైమార్క్ పై చర్యలకు హైడ్రా యాక్షన్ ప్లాన్
X

దిశ, దుండిగల్ : మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చేసిన పాపాలు ఒక్కటిగా బయట పడుతున్నాయి. మల్లంపేటలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస నిర్మాణ సంస్థ కత్వచేరువును ఆక్రమించి విల్లాల నిర్మాణాలు చేపట్టడంతో స్థానికుల ఫిర్యాదు ఆధారంగా.. దిశ దిన పత్రికలో పతాక శీర్షికన వరుస కథనాలు వెలువడ్డాయి. దీంతో పరిశీలించిన హైడ్రా అధికారులు కత్వచేరువు ఎఫ్ టి ఎల్ లో నిర్మించిన 15 విల్లాలను కూల్చివేశారు. బహదూరపల్లి లోని ప్రైమర్క్ నిర్మాణ సంస్థ బాబ్బాకాన్ చెరువు కట్టుకాలుకాను ఆక్రమించి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడంతో దిశలో 2023 లో వరుస కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. స్పందించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సర్వే నిర్వహించి చేతులు దులుపుకున్నారు. హైడ్రా దూకుడుతో ఎట్టకేలకు ప్రైమర్క్ నాలా కబ్జా తెరపైకి వచ్చింది. బహదూరపల్లి లోని ప్రైమర్క్ నిర్మాణదారుడు చేపట్టిన బాబ్బాకాన్ చెరువు నాలను పరిశీలించి చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం.ఇరిగేషన్ ఏఈ సారా,సర్వే రూప తో కలిసి హైడ్రా అధికారులు బాబ్బాకాన్ చెరువు నాలా కబ్జాను గురువారం పరిశీలించి స్థానికుల ద్వారా వివరాలు సేకరించారు.

Advertisement

Next Story

Most Viewed