- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ నేత ఇంటిలో భారీగా నగదు డంప్..?
దిశ, మేడిపల్లి : అధికార పార్టీ డబ్బులు పంచడానికి కోట్లాది రూపాయల నగదును డంపు చేసుకొని ఉన్నారని ఆరోపణలు వెళ్ళువెత్తుతున్నాయి. నాలుగు రోజుల క్రితమే ఈ విషయమై మేడ్చల్ నియోజకవర్గం పీర్జాదిగూడలో పెద్ద ఘర్షణ జరిగింది. తాజాగా బోడుప్పల్ లో ఇదే విధమైన ఫిర్యాదు రావడంతో ఎన్నికల అధికారులు తనిఖీలకు వెళ్లడంతోఉధృక్త పరిస్థితి నెలకొన్నది. మరొక ఆరు రోజుల్లో పోలింగ్ ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ పెద్ద మొత్తంలో నగదును ఓటర్లకు పంచడానికి సిద్ధమవుతోంది అన్న అనుమానాలకు బలం చేకూరుతుంది.
అధికార పార్టీ అధ్యక్షుడు ఇంటిలో..
మేడిపల్లి మండలం బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి ఇంటిలో ఐదు కోట్ల రూపాయల వరకు నగదును నిల్వ ఉంచారు అన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్నికల అధికారులు రాధిక తన సిబ్బందితో కలిసి తనిఖీలకు వెళ్లారు. తనిఖీలలో భాగంగా వారు ఇన్కమ్ టాక్స్ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో భారీగా నగదు డంపు ఉన్నదని అనుమానాలకు బలం చేకూరడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ విషయం పై విస్తృతంగా ప్రచారం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
ఉద్రిక్త పరిస్థితులు…
ఎన్నికల అధికారులు తమ అధ్యక్షుడు ఇంటిలో తనిఖీలకు వచ్చారని సమాచారం తెలుసుకున్న అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్దసంఖ్యలో సంజీవరెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఎన్నికల అధికారులకు, పోలీసులకు, బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. దీంతో ఆయన ఇంటి వద్ద బందోబస్తు చేపించారు పోలీసులు. ప్రస్తుతానికి బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది.
తనిఖీలు చేస్తారా..? వెనకడుగు వేస్తారా..?
కోట్లాది రూపాయలు నగదు నిల్వలు ఉన్నాయని విస్తృత ప్రచారం జరగడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎన్నికల అధికారుల పై ఉన్నది. అధికారి పార్టీలకు లోనై తనిఖీలు చేయకుండానే వెనకడుగు వేస్తారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఐటీ అధికారులు వచ్చేదాకా వేచి ఉంటాము అని చెప్పటం.. వారు వచ్చినప్పటికీ ఇంకా ఇంటిలోకి తనిఖీలు చేయకుండా ఉండటం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రత్యర్థి పార్టీ నాయకులు కార్యకర్తలు.
పీర్జాదిగూడలో సైతం..
ఈ నెల 19న పీర్జాదిగూడలో ఒకటో వార్డులో ఏవి ఇన్ఫ్రా లో ఒక ఇంటిలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు నివాసం ఉంటున్నారని, వారు నిత్యం బ్యాగులను తీసుకొని బయటికి వెళ్లి తిరిగి కాళీ బ్యాగ్లతో వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేశారు. దీంతో ఎన్నికల అధికారులు ఆ ఇంటికి వెళ్లేసరికి దానికి తాళం వేసి ఉంది. ఈ పరిణామంతో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఒకరి పై ఒకరు పిడి గుద్దులు కురిపించుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులు చెదరగొట్టిన విషయం తెలిసిందే. తాజాగా బోడుప్పల్ లో కూడా ఇదేవిధంగా జరగడంపై డబ్బులు పంచుకున్నారు అన్న విషయంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.