- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hot News: మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్..! భూ కబ్జా విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని, జీడిమెట్ల సర్వే నెం.82లో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు 33 గుంటల భూమిని కబ్జా చేశారంటూ రెవెన్యూ అధికారులు నిజాన్ని నిగ్గు తేల్చారు. సుచిత్రలోని సర్వే నంబర్ 82లో వివాదాస్పద భూమిపై హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు నిర్దాక్షిణ్యంగా భూ కబ్జాకు పాల్పడినట్లుగా రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. అయితే, అదే నివేదికను వారు హై కోర్టుకు పోలీసులు ద్వారా అందజేశారు. ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కబ్జాకు గురైన ప్రభుత్వం భూమికి వెంటనే రక్షణ కల్పించాలని ధర్మాసనం సూచించింది. ఈ మొత్తం పరిణామంతో కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్టు తప్పదా.. అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. కాగా, ఆయనపై జిల్లా వ్యాప్తంగా అనేక భూ కబ్జా ఆరోపణలు ఉండటంతో సర్కార్ ఆయనపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.